“జోడో యాత్ర” విజయవంతంతో ప్రతిపక్షాల్లో గుబులు
– జోడో యాత్ర విజయోత్సవ ర్యాలీలో కొలన్ హనుమంతు రెడ్డి
గాజులరామారం (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 7: దేశవ్యాప్తంగా విజయవంతంగా తొలి దశ భారత్ జోడో యాత్ర విజయవంతం అవడంతో ప్రతిపక్షాలలో గుబులు పుట్టడం మొదలైందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత కొలన్ హనుమంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో గాజులరామారం లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి భారత్ జోడో విజయోత్సవ ర్యాలీని ముఖ్య అతిథిగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ, ప్రస్తుత ప్రభుత్వం వలన దేశానికి కలుగుతున్న నష్టాలను వివరిస్తూ సాగుతున్న జోడో యాత్ర తో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికలలో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ సాధించిపోయే విజయాలను ఎవరు అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ త్వరలో చేపట్టిపోయి రెండవ దశ భారత్ జోడో యాత్రతో ప్రతిపక్షాలు కనుమరుగవటం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్. అవిజె జేమ్స్, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ ముదిరాజ్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, టేకుల ప్రవీణ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి,కోలన్ జీవన్ రెడ్డి, అసిఫ్, అజమ్, సత్తి రెడ్డి, రఫాత్, ఎమ్ .ఎస్ చౌదరి, లక్ష్మణ్, శ్రీశైలం యాదవ్, శ్రీధర్ రెడ్డి, వీర రెడ్డి,ప్రతాప్ రెడ్డి, గణేష్, రాజశేఖర్, వేణు, మొండి సాయి కృష్ణ, తులసి రెడ్డి, షఫీ, ఎండీ.లాయక్, అజయ్, అన్వార్, అయిమాద్, పుల్లెం రాజు, నిఖిల్ రెడ్డి, వసంత్ కుమార్, మహిళ నాయకులు యాదమ్మ, కౌసల్య, గౌసియా, రెహానా బేగం , హసీనా, కుమారి, కమల,రమ్య ఎన్ ఎస్ యు ఐ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.