- అదుపు తప్పిన ద్విచక్ర వాహనం
- చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పేట్ బషీరాబాద్ క్రైమ్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 11: దావత్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై నుండి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… జీడిమెట్ల గ్రామంలోని మార్వెల్ అపార్ట్మెంట్ లో నివాసముండే ప్రవీణ్ కుమార్ అలియాస్ గంగారెడ్డి (40 ) సంగారెడ్డిలో బంధువుల దావత్ ఆదివారం ఉండడంతో మధ్యాహ్న సమయంలో తన ద్విచక్ర వాహనంపై వెళ్ళాడు. అదే రోజు రాత్రి సమయంలో తాను ఇంటికి తిరిగి వస్తుండగా హోలీ స్పిరిట్ సిస్టర్స్ చర్చ్ ఎదురుగా తన ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అతని భార్య ఝాన్సీలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం సుమారు మధ్యాహ్నం 1.12 గంటలకు ప్రవీణ్ కుమార్ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు