- ప్రజావాణి కోసం ఎవరూ రాకండి.- కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 25: నేడు (సోమవారం) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కు ప్రజలు ఎవరు ఫిర్యాదులు అందించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి రావద్దని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో నేడు జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని అనివార్య కారణాలవల్ల రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్, జిల్లా స్థాయి ఉన్నతాధికారుల సమావేశాలతో పాటు ఇతరత్రా సమావేశాలు, కార్యక్రమాలు ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు సదరు విషయాన్ని గమనించి ఎవరూ కూడా కలెక్టరేట్ కు వచ్చి ఇబ్బంది పడొద్దు అని సూచించారు.