పేదలు కనిపించడం లేదా దొరా…- కొలన్ హన్మంత్ రెడ్డి
షాపూర్ నగర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 22: డబ్బు ఉన్నోళ్లకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తారా…? నిరుపేదలు మీకు కనిపించరా… దొర అంటూ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద ను కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి ప్రశ్నించారు. సూరారం డివిజన్ పరిధి షాపూర్ నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి అన్నారు. గురువారం దుండిగల్ లో నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ పంపిణీ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట 126 డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కౌసల్య, అదే డివిజన్‌లోని బీజేపీకి చెందిన సునీత అనే మహిళకు మొదటి విడతలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చామని చెప్పుకోవడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు.. రాజకీయ లబ్ది కోసం ఇతర పార్టీలకు చెందిన ఒక్కో మహిళకు ఇళ్లు ఇచ్చి.. నియోజకవర్గంలోని పేదలందరికి ఇచ్చినట్లు చెప్పడం ఎంత వరకు సబబో వారికే తెలియాలి అన్నారు. హైద్రాబాద్ పట్టణంలో కొంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తున్నట్లు చెబుతున్న నేతలు, మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పేదల పరిస్థితి ఏంటి..? అనే విషయంపై మాత్రం మాట్లాడటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మందిని నిరాశకు గురిచేస్తూ, నగరంలో ఒకరిద్దరికి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించే మాట్లాడుతున్నారంటేనే.. అది వారి వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్ ముదిరాజ్, డాక్టర్ అవిజె జేమ్స్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్ గణేష్, మాజీ కౌన్సిలర్ వరమ్మ, నరేందర్ రెడ్డి, మైనారిటీ సెల్ నాయకులు అంజాద్, షఫీ, జెస్సీ, శ్రీనివాస చారి, సంతోష్ ముదిరాజ్, బి.శివకుమార్, లాయక్, అజయ్, రోషన్, నిఖిల్ రెడ్డి, గురువా రెడ్డి, శ్రీనివాస్, వీరారెడ్డి, వసంత్, అన్వర్, మహిళా కాంగ్రెస్ నాయకులు యాదమ్మ, లలిత, కుమారి, హసీనా, అన్నపూర్ణ, లక్ష్మి, లక్ష్మి, రేవతి యువజన నాయకులు, న్సుఇ నాయకులు, ఐ ఎన్ టి యు సి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు