ప్రేమ వ్యవహారంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 24 : ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా చిట్యాలకు చెందిన పి. సాంబమూర్తి కుమారుడు పి. సాయి కృష్ణ (23) చింతల్ లోని శ్రీనివాస నగర్ లో నివాసం ఉంటూ సూరారం లోని హెటిరో పరిశ్రమలు ఉద్యోగం చేస్తూ జీవనం జీవనం సాగిస్తున్నాడు. తాను నివాసం ఉంటున్న గదిలో సుమారు సోమవారం అర్థరాత్రి సమయంలో ఫ్యాన్ కు లుంగీ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారంతో పాటు ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.