ఫార్మా బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 31: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదాచారుడిని బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ గ్రామం నుంచి సుచిత్రకు వెళ్లే ప్రధాన రహదారిలో హార్ట్ అండ్ స్పైస్ హోటల్ ఎదురుగా సుమారు రాత్రి 9 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఆస్ప్రో ఫార్మా కంపెనీకి చెందిన బస్సు (టీఎస్ 07 యూజీ 7446) కంపెనీ సిబ్బందిని తీసుకొని మియాపూర్ నుంచి షామీర్పేట్ వెళ్తూ కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదాచారుడిని వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో పాదాచారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా బస్సు నడపడం వల్ల ప్రమాదం సంబంధించిన తెలుస్తుంది. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.