బాపూనగర్ లో ముక్తేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 19 : ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని మాజీ కార్పొరేటర్ కేఎం. గౌరీష్ అన్నారు. డివిజన్ పరిధిలోని బాపూనగర్ లో శ్రీ శుభానందా దేవి సమేత ముక్తేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలతో కలిసి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధికి భక్తులు ధన, వస్తు రూపేనా సహాయ సహకారాలు అందించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చిట్టిమిల్ల దయానంద్, సభ్యులు సత్యనారాయణ, సుకుమార్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సందీప్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, సత్యప్రసాద్, మధుసూదన్, సత్యనారాయణ నాయుడు, బాబురావు, పూజారి ప్రశాంత్, శ్రీనివాసరావు, సాంబశివరావు, కనకయ్య, సురేందర్, పి. వెంకటేష్, జి. వెంకటేశ్వర్లు, మహేష్, మధు, సాగర్ రెడ్డి, కిషన్, భక్తులు పాల్గొన్నారు.