బిఆర్ఎస్ బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి క్యూ…
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ లో చేరికల జోరు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 28: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు వరుస పెట్టి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో కుత్బుల్లాపూర్ లో కారు జోరు తగ్గిందనే భావన ప్రజల్లో వెలువడుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని వివిధ డివిజన్ లు, మున్సిపాలిటీలకు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు రోజుకోచోట గులాబీ కండువా పక్కనపెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరిగిందనే చర్చ ఊపు అందుకుంది. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి చెరుకుపల్లి కాలనీ కి చెందిన బిఆర్ఎస్ మహిళా నాయకురాలు సుజాత వారి మిత్ర బృందం, కాంగ్రెస్ నాయకుడు జాకీర్ ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ గాంధీ నగర్ బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి సాయి కిరణ్, సాయి కుమార్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కోలన్ హనుమంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా కోలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ప్రజా ధారణ పెరుగుతోందాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం లోకి వస్తే అమలు చేయనున్న 6 గ్యారంటీలు, ప్రధాన హామీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలతోపాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై సొంత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.