బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గా ఏర్పడి అభివృద్ధిని సాధించింది. -ఎమ్మెల్యే వివేకానంద్

  • 15 కోట్ల వ్యయంతో నిజాంపేట్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్.

నిజాంపేట (న్యూస్ విధాత్రి ), సెప్టెంబర్ 23:  ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ సహకారంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి వార్డ్ ని అభివృద్ధి పరిచామని, ప్రధానంగా నిజాంపేట్ పరిదిలో త్రాగునీటి కష్టాలను తొలగించి స్వచ్ఛమైన మంచి నీటి సరఫరా అందిస్తున్నామని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ , మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమీషనర్ రామకృష్ణ రావుతో కలిసి 7,11,12,13,14 వ డివిజన్లో శనివారం ప్రగతి యాత్ర నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక డివిజన్లో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, రవికిరణ్, ఆవుల పావని జగన్ యాదవ్, రాజేశ్వరీ వెంగయ్య చౌదరీలతో కలిసి పాదయాత్ర చేసారు.

ఈ మేరకు 7వ డివిజన్ పరిధి 191 కాలనీ లో రూ. 13 లక్షల వ్యయంతో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం, రూ.12లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్, రూ.45 లక్షల వ్యయంతో కాలనీలో ప్రహరీ గోడ నిర్మాణం, రూ. 15 లక్షల వ్యయంతో క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవాలు చేశారు. అదే విధంగా 12వ డివిజన్ పరిధిలో రూ. 493.10 లక్షల వ్యయంతో వైకుంఠ ధామం అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవం, రూ.15 లక్షల వ్యయంతో రెండు ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాలు, రూ. 40లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్ర భవనం నిర్మాణం, రూ. 35లక్షల వ్యయంతో నినింటో థీమ్ పార్క్ నిర్మాణం, రూ. 30లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీ ఫేస్ -3 లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రూ. 25లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీ ఫేస్ -2 లో కమ్యూనిటీ హాల్ మిగిలి ఉన్న పనులుకు శంకుస్థాపన చేశారు.

14వ డివిజన్ పరిధిలో రూ. 30లక్షల వ్యయంతో వెంకట్రాయ కాలనీ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం,రూ. 12లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్ ఏర్పాటు, రూ. 25లక్షల వ్యయంతో ఆచారి కుంట, బాలాజీ నగర్ పార్క్ వద్ద మరుగుదొడ్లు, వాచ్ మెన్ రూం ఏర్పాట్ల పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 30 లక్షల వ్యయంతో 13వ డివిజన్ పరిధిలో ఖాళీ స్థలాల్లో ప్రహరీ గోడ నిర్మాణం, గేట్ల ఏర్పాటు, రూ. 12లక్షల వ్యయంతో 11వ డివిజన్ పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు, రూ. 65లక్షల వ్యయంతో చిన్నపిల్లల ఆట సామాగ్రి ఏర్పాటు, రూ. 20లక్షల వ్యయంతో కేటీఆర్ కాలనీ పార్క్ అభివృద్ధి పనులు, రూ. 25లక్షల వ్యయంతో కేటీఆర్ కాలనీ పార్క్ లో బాక్స్ క్రికెట్ నెట్ ఏర్పాటు, రూ. 20లక్షల వ్యయంతో ఖాళీ స్థలాల్లో లో ప్రహరీ గోడ, గేట్లు ఏర్పాటు, రూ. 10లక్షల వ్యయంతో కేటీఆర్ కాలనీ పార్క్ లో మరుగుదొడ్లు, వాచ్ మెన్ రూం ఏర్పాటు, రూ. 15.50 లక్షల వ్యయంతో బోర్ వెల్స్, వాటర్ సంప్, హైమస్ట్ లైట్ల ఏర్పాటు, రూ. 10లక్షల వ్యయంతో కేటీఆర్ కాలనీ పార్క్ లో వాటర్ పైప్ లైన్, వైరింగ్ ఏర్పాటు, రూ. 59లక్షల వ్యయంతో ప్రధాన ద్వారం, థీమ్ పార్క్, సీసీ కెమెరాల ఏర్పాటు, రూ. 60లక్షల వ్యయంతో ఈస్ట్ విల్లా లాండ్ మార్క్ నుంచి బాలాజీ నగర్ కమాన్ వరకు ఎస్ డబ్ల్యూ డ్రైన్ నిర్మాణం, రూ. 50లక్షల వ్యయంతో 11, 12 వార్డ్ లలో తారురోడ్డు నిర్మాణం, రూ. 35లక్షల వ్యయంతో కేటీఆర్ కాలనీ రోడ్ నెంబర్-5 లో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల మరమ్మత్తు పనులను ప్రారంభించారు.

రూ. 10లక్షల వ్యయంతో 13వ డివిజన్ పరిధిలో బస్తీ దవాఖన ఏర్పాటు, రూ.5లక్షల వ్యయంతో న్యూ శ్రీనివాస నగర్ కమ్యూనిటీ హాల్ మిగతా పనులు నిర్మాణం, రూ. 20లక్షల వ్యయంతో శ్రీలక్ష్మి డ్రై క్లీనింగ్ నుంచి కాజిల్ టౌన్ హై స్కూల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ. 5లక్షల వ్యయంతో తిరుమల నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణం, రూ. 200 లక్షల వ్యయంతో ఆధునిక దోభి ఘాట్ ఏర్పాటు వంటి నిర్మాణ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గా ఏర్పడి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందన్నారు. అనంతరం పెండింగ్ లో ఉన్న పనులను త్వరత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు,ఆయా డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,NMC ఆయా విభాగాల అధికారులు, మరియు సిబ్బంది,స్థానిక డివిజన్ ఆయా కాలనీల అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More