బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తుంది.-ఎమ్మెల్యే వివేకానంద్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్20: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ప్రగతి యాత్రలో భాగంగా 110వ రోజు కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి మహేంద్ర నగర్, కాకతీయ నగర్ లో మాజీ కార్పొరేటర్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కే యం గౌరీష్ తో కలిసి బుధవారం పాదయాత్ర నిర్వహించారు. ఆయా కాలనీలో పూర్తయిన సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఇతరత్రా భివృద్ధి పనులను పరిశీలించారు.తమ కాలనీలో అభివృద్ధి పనులను పూర్తి చేసినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యేను సన్మానించారు.
కాలనీలలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేయించాలని వారు కోరగా స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న అధికారులకు ఆయా పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి కాలనీ బస్తీల్లో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు అనంతరం ఆయా కాలనీలలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్,డివిజన్ అద్యక్షులు దేవరకొండ శ్రీనివాస, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు ఎం శ్రీనివాస్ రెడ్డి, వీ ఎస్ ఆర్ కె ప్రసాద్, పోచయ్య, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, మల్లయ్య, దుర్గ ప్రసాద్, మధుసూదన్ రావు, శ్రీనివాస్ రావు, సుబ్బారావు, శ్రీనివాస్ పంతులు, బి వీ రావు, సత్యనారాయణ, స్వామి, మల్లేష్, మనోహర్ రావు, గంగాధర్, ఇబ్రహీం, కృష్ణ రెడ్డి, ఎన్నా రెడ్డి, భూపాల్ రెడ్డి,నజీర్, గోపాల్ రెడ్డి, రాఘవులు, శ్రీనివాస్ రెడ్డి, సజ్జు బాపన్, నీలిమ, సింధు,స్వప్న, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.