సురారం క్రైమ్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 7: భవనం పై నుండి పడి బాలుడు మృతి చెందిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం… సూరారం రాజీవ్ గృహకల్ప 29వ బ్లాక్ లో నివాసం ఉంటున్న కనకరత్నం కుమారుడు తులసీనాథ్ (13) 6వ తరగతి చదువుతున్నాడు. గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాఠశాలకు సెలవు ఉండడంతో స్నేహితులతో కలిసి మూడవ అంతస్తులో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి తులసీనాథ్ కిందపడ్డాడు. దీంతో తలకు, శరీర భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.