మీడియా అక్రిడిటేషన్ కార్డుల గడువు పెంచుతూ ఉత్తర్వులు
~ మరో మూడు నెలలు పెంచాలని ఆదేశం
~ జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు
~ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఐ అండ్ పిఆర్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 19 : తెలంగాణ రాష్ట్రంలో విలేకరులుగా విధులు నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల మీడియా అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం. హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 30వ తేదీతో అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగియనుండడంతో జర్నలిస్టులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల గడువును జూలై ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మూడు నెలలు చెల్లుబాటు అయ్యేలా పొడిగించాలని రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.