రాష్ట్ర ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీసీ
కుత్బుల్లాపూర్, (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 28: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రిటర్నింగ్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్ల ప్రక్రియ, సువిధ యాప్ లో రాజకీయ పార్టీలు ప్రచారానికి పొందవలసిన అనుమతుల ప్రక్రియ లోని అభ్యంతరాలను అధికారులను అడిగి తెలుసుకుని కేంద్ర ఎన్నికల ప్రతినిధులు నివృత్తి చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు నియోజకవర్గాల ఎన్నికల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వో సైదులు, ఈఆర్వో నాగమణి ,ఏఈఆర్వో లు ఉదయ్ కుమార్, మల్లారెడ్డి, రెహ్మాన్ ఖాన్, శ్రీనివాస్, శ్రీహరి, సుచరిత, సిబ్బంది పాల్గొన్నారు.