రేపు నులిపురుగుల నిర్మూలన దినం
~ అల్బెండజోల్ పంపిణీకి రంగం సిద్ధం
~ 2,03,750 మందికి మాత్రల పంపిణీ
~ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 19 : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఎయిడెడ్ కళాశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19 ఏళ్ల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను వైద్యాధికారులు, సిబ్బంది, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే వాటికి సంబంధించిన మందులను స్థానిక ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జిల్లా వైద్యాధికారులు అందజేశారు. గతంలో నకిలీ అల్బెండజోల్ మాత్రల హల్ చల్ పలు అనుమానాలు రేకెత్తడంతో ప్రజలు ఆందోళనకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించే నులిపురుగుల నివారణ మాత్రలు (అల్బెండజోల్) వల్ల ఎటువంటి అనర్థాలు చోటు చేసుకోవని, పిల్లలకు వాటిని నిర్భయంగా వేయించవచ్చని వైద్యాధికా
రులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
• మాత్రలకు అర్హులైన వారి జాబితా…
నియోజకవర్గ పరంగా ఉన్న 612 విద్యాలయాలకు గాను 2,02,731 మంది విద్యార్థులకు, పాఠశాలలకు వెళ్లని 1,019 వారితో కలిపి మొత్తం 2,03,70 మాత్రలు పంపిణీ చేయనున్నట్లు మండల వైద్యాధికారి డా. నిర్మల తెలిపారు. వీటిలో 224 అంగన్వాడీ కేంద్రాలకు గాను 37,984మంది, 72 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన 38,669 మంది, 262 ప్రైవేటు పాఠశాలలకు చెందిన 92,728 మంది, 8 ఎయిడెడ్ కళాశాలలకు చెందిన 350మంది, 46 ప్రైవేటు జూనియర్ కళాశాలలకు చెందిన 33,000 మంది, నాలుగు మదర్సా లకు చెందిన 183 మంది విద్యార్థులు ఉన్నారు.
• ఇలా సంక్రమిస్తాయి…
నులిపురుగులు ప్రధానంగా మానవులు పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధి చెందే పరాన్న జీవులు. వీటిని
ఏలికపాములు, నులిపురుగులు, కొంకి పురుగులు అనే మూడు రకాల క్రిములుగా పరిగణిస్తారు.
» ఆరుబయట వట్టికాళ్లతో ఆడుకోవడం.
» చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారం భుజించడం.
» బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రవిసర్జన చేయడం.
పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ప్రధానంగా నులి పురుగులు సంక్రమిస్తాయి. నులిపురుగులు సంక్రమించిన పిల్లలు అనేక హానికరమైన ఆరోగ్య సమస్యలతో భాదపడుతుంటారు. వాటిలో ముఖ్యంగా రక్త హీనత, పోషకాల లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, అతిసారం, బరువు తగ్గడం వంటి అనార్ధాలు సంభవిస్తాయి.
• నిర్మూలన…..
అల్బెండజోల్ మాత్రలను వేసుకోవడం, పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల నులిపురుగులను
నిర్మూలించవచ్చు. నిర్మూలన వల్ల పిల్లల్లో రక్తహీనత
నియంత్రణ, పోషకాల గ్రాహ్యత మెరుగుపడడం వంటి
అల్బెండజోల్ మాత్రలు ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా ఏకాగ్రత, నేర్చుకోగల సామర్థ్యం పెరుగుతుంది. పని సామర్థ్యం, జీవనభృతి అవకాశం పెరుగుతుంది. పర్యావరణంలో నులిపురుగుల వ్యాప్తిని తగ్గించడం వల్ల సమాజానికి మేలు చేకూరుతుంది. ఈ నేపథ్యంలో 1 నుంచి 19 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా అల్బెండజోల్
మాత్రలను వేసుకోవాలని, నులిపురుగులు వ్యాపించకుండా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. గురువారం మాత్రలను తీసుకోని,
అందుబాటులో లేని విద్యార్థులు ఈ నెల 27వ తేదీన (మాప్ అప్ డే) మాత్రలను వేయించుకొనే అవకాశం ఉంటుందని డా. నిర్మల తెలిపారు.
అవగాహన కలిగి ఉండాలి
నులి పురుగులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి, అవి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్లో నులిపురు
వ్యాపించిన లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి మందులను వాడాలి. పిల్లలకు కూడా నులిపురుగులపై అవ
గాహన కల్పించి పరిశుభ్రతను పాటించేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి.
– డా.నిర్మల, కుత్బుల్లాపూర్ మండల వైద్యాధికారి