శ్రీ శ్రీ చిత్తారమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
~ ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డు ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 16 : గాజులరామారంలోని శ్రీ శ్రీ చిత్తారమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఆలయం మరింత అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆకాంక్షించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డు శిలాఫలకాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆదివారం ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. భక్తులకు ఇటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని ఆలయ కమిటీ సభ్యులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య గౌడ్, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్, బాలరాజు, ఇంద్రసేనా రెడ్డి, ఇంద్రసేనా గుప్తా, పెంటారెడ్డి, ఆర్. నర్సింహా, జి. నర్సింహా, లక్ష్మణ్, ఆర్. సత్తయ్య, శ్రీరాములు, క్రిష్ణారెడ్డి, శంకర్ రెడ్డి, ఆర్. యాదగిరి, ప్రభు గౌడ్, శ్రీరాములు, నర్సింహా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.