సర్వేనెంబర్ 329 ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
గాజులరామారం (న్యూస్ విధాత్రి), ఆగస్ట్ 6 : గాజులరామారం సర్కిల్ పరిధి దేవేందర్ నగర్ సర్వేనెంబర్ 329 ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో కొరడా ఝళిపించారు. బాలనగర్ ఏసిపి హనుమంతరావు సమక్షంలో సూరారం, జగద్గిరిగుట్ట సిఐలు భరత్ కుమార్, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సుమారు వందమంది పోలీసుల భద్రత తో మూడు ప్రోక్లైన్లను ఉపయోగించి అక్రమంగా నిర్మించిన గదులను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.