కుత్బుల్లాపూర్ లో ముసాయిదా ఓటరు జాబితా విడుదల

• అభ్యంతరాలు, మార్పులు చేర్పులకు అవకాశం
• మొత్తం ఓటర్లు 7,31,517 మంది, పురుషులు 3,81,406, మహిళలు 3,49,946, ఇతరులు 165 మంది
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 29 :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఓటరు ముసాయిదా
జాబితా (డ్రాఫ్ట్ రోల్)ను కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాల
యంలో ఈఆర్వో, ఉప కమిషనర్ వి. నరసింహ, అధికారు
లతో కలిసి మంగళవారం విడుదల చేశారు. సెప్టెంబర్
20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు
పొందుపరిచి ముసాయిదా ఓటర్ జాబితాను తయారు
చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీ, 2025 ప్రాతిపదికన విడుదల చేసే తుది ఓటరు జాబితాలోపు ఓటర్లు వివరాలను పరిశీలించుకొని ఏవైనా అభ్యంతరాలు, మార్పులు చేర్పులు ఉంటే ఈఆర్వో కార్యాలయాన్ని సంబంధిత కేంద్రాలను, అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని వారు తెలిపారు.నూతన ఓటరు గుర్తింపు కార్డు నమోదుకు ఫారం-6ను, సర్వీస్ ఓటర్ కు ఫారం -6ఎ ను, తొలగింపులకు ఫారం-7ను, మార్పులు, చేర్పులకు ఫారం- 8ను, పోలింగ్ బూత్ మార్పునకు ఫారం – 8 మైగ్రేషన్ ను దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సదవకాశాన్ని వినియోగించుకొని గతంలో మాదిరిగా 18 ఏళ్లు పూరైన అనంతరం కాకుండా నూతన విధానంలో ప్రస్తుతం 17ఏళ్లు పూరైన వెంటనే ప్రతి మూడు నెలలకోసారి పౌరులు నూతన ఓటర్లుగా ధరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందవచ్చని ఈఆర్వో తెలిపారు. ఈ మేరకు 17 ఏళ్లు పూరైన వారు ప్రతియేడు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1వ తేదీల నుంచి నూతన ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఓటరు తన ఓటర్ కార్డుతో ఆధార్ ను అనుసంధానం (లింగ్) చేసుకోవాలని సూచించారు.

సిద్ధమైన ముసాయిదా ఓటరు జాబితా ప్రతులు

• ముసాయిదా జాబితాకు అందిన దరఖాస్తులు…

ముసాయిదా జాబితా నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు వివిధ అంశాల్లో పలు దరఖాస్తులు అందాయి. వాటిలో ఫారం-6 కు 9,887 దరఖాస్తులు అందగా వాటిలో 6,826 దరఖాస్తులను అంగీకరించి, 3,056 దరఖాస్తులను వివిధ కారణాలవల్ల తిరస్కరించారు. అలాగే ఫారం – 6ఎ కు 9 అందగా 6 దరఖాస్తులను అంగీకరించి, మూడింటిని తిరస్కరించారు. ఫారం -7 కు 2,159 దరఖాస్తులు అందగా 1,189 అంగీకరించి, 242 దరఖాస్తులను తిరస్కరించారు. వీటిలో మిగిలి ఉన్న 716 దరఖాస్తులను ఇతర నియోజకవర్గాల్లో అంగీకరించక పోవడంతో పెండింగ్లో ఉన్నాయి. ఫారం – 8 కు 7,544 దరఖాస్తులు అండగా 6,609 దరఖాస్తులను అంగీకరించి 920 దరఖాస్తులను తిరస్కరించారు.

• ముసాయిదా ఓటర్ జాబితా ప్రకారం…
మంగళవారం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు
7,31,517 మంది. కాగా, అందులో పురుషులు 3,81,406
ఓటరు, మహిళలు 3,49,946 మంది ఓటర్లు, ఇతరులు 165
ఓటర్లు ఉన్నారు. కార్యక్రమంలో ఏఈఆర్వో కృష్ణ, ఎన్నికల సూపరిండెంట్ గిరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More