ప్రముఖ ఫొటో గ్రాఫర్ భరత్ భూషణ్ కన్నుమూత
సిఎం కెసిఆర్ తదితరుల ప్రగాఢ సంతాపం
ప్రముఖ ఫొటో గ్రాఫర్ భరత్ భూషణ్ గుడిమల్ల ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భరత్ ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సామాజిక స్పృహ కలిగిన ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నల్లకుంటలోని ఆయన నివాసంలోకి వెళ్లగానే పల్లె అందాలు కట్టిపడేస్తాయి. ప్రతి ఫొటోకు క్యాప్షన్ అవసరం లేదని, ఫొటో చూడగానే భావాన్ని గుర్తించవచ్చు.
భరత్ మృతి పట్ల సిఎం కెసిఆర్, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 1970 ఫొటోగ్రాఫర్ వృత్తిలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఆ వృత్తిని జీవతంగా మలుచుకున్నారు. పలు ఇంగ్లీష్, తెలుగు దినపత్రికలలో ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆయన మృతికి డియా అకడ ఛైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్ట్ జాక్ అద్యక్షుడు దేవరకొండ కాళిదాస్, కన్వీనర్ అవ్వారు రఘులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యలుకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.