అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం
– దండు సాయి కిరణ్
కూకట్ పల్లి (న్యూస్ విధాత్రి), జూలై 18 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వామ్యం అయి నిరంతరం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం పని చేస్తామని దండు సాయికిరణ్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో ఆయన తన మిత్ర బృందం, అనుచరులతో కలిసి బి.ఆర్.ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తమ వంతుగా పని చేస్తామని తెలిపారు. నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ యువత కాంగ్రెస్ పార్టీలోకి రావడం మంచి పరిణామం అని, రాబోయే రోజులలో పార్టీ మరింత బలోపేతంగా మారుతూ ప్రజలకు సేవ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో రాయపాటి వెంకటేష్, అజయ్, కృష్ణ, సురేష్, అమర్, శ్రీను, శేఖర్, ప్రకాష్ , కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి, తూము వేణు, పుష్పారెడ్డి, కోప్పి శెట్టి దినేష్, శ్రీకాంత్ పటేల్, శివ, రమేష్, జంగిర్, అస్లాం, మాధురి రాము, చున్ను, పాష, నజీర్, ఆయాజ్ ,అబ్దుల్లా, రేష్మ, సంధ్య, రేణుక పాల్గొన్నారు.