అమ్మవారి దయతో అష్టైశ్వర్యాలు సమకూరుతాయి
కుత్బుల్లాపూర్ న్యూస్ విధాత్రి జూన్ 16 : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దయ ఉంటే అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి జగద్గిరిగుట్టలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానంలో నిర్వహించిన హోమంలో పూర్ణాహుతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, డైరెక్టర్ పెండం మహేష్, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు హజ్రత్ అలీ, గిరి, మనోజ్, చారి, మెట్ల శ్రీను, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా, గౌరవ చైర్మన్ కాచం కైలాసం గుప్త, అధ్యక్షుడు ఉప్పల రమేష్ గుప్త, చైర్మన్ నీతి శంకర్ గుప్తా, కమిటీ సభ్యులు లక్ష్మణరావు గుప్త, మహంకాళి సురేష్ గుప్తా, యాద నరేందర్ గుప్త, గంజి స్వామి గుప్తా, అంగడి సత్యనారాయణ గుప్తా, లక్ష్మీ నరసయ్య గుప్తా, కృష్ణమూర్తి గుప్తా, నరసింహులు గుప్త, ఉపేందర్ గుప్త పాల్గొన్నారు.
• ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రధమ వార్షికోత్సవం
జీడిమెట్ల డివిజన్ అయోధ్య నగర్ లోని శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధమ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నదీమ్ రాయ్, యేసు, శ్రీ విరాట్ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు బ్రహ్మయ్య చారి, గౌరవాధ్యక్షులు కృష్ణాచారి, నారాయణ చారి, బాబు చారి, ప్రధాన కార్యదర్శి రమేష్ చారి, కోశాధికారి ఆంజనేయులు చారి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.