~ అల్వాల్ పంచశీల కాలనీలోని వారి ఇంట్లో ఘటన
~ మృతురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
~ రూపాదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే సత్యం
~ భార్య మృతి జీవించుకోలేక కన్నీటి పర్యంతమై స్పృహ తప్పి పడిపోయిన సత్యం
~ ఎమ్మెల్యేను ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
~ ఆత్మహత్యకు ముందు భర్తకు వీడియో కాల్ చేసినట్లు సమాచారం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 21: కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం అర్ధరాత్రి దాటిన అనంతరం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అల్వాల్ పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే కుటుంబం నివాసం ఉంటున్నారు. అదే ఇంట్లో రూపాదేవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని బంధువులు చెబుతున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దంపతులకు కుమారుడు యోజిత్ , కుమార్తె రిషిక శ్రీ ఉన్నారు. రూపదేవిని, ఎమ్మెల్యే సత్యం ప్రేమించి వివాహం చేసుకున్నారు. రూపాదేవి రెండు రోజులుగా పాఠశాల విధులకు వెళ్లడం లేదు. ఎమ్మెల్యే సత్యం గురువారం ఉదయం చొప్పదండి నియోజకవర్గానికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే కుటుంబం బంధువులతో కలిసి కొద్ది రోజుల క్రితం తిరుమలతో పాటు పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య మృతిని జీవించుకోలేక ఆస్పత్రిలో ఎమ్మెల్యే సత్యం స్పృహ తప్పి పడిపోయారు. ఎమ్మెల్యే భార్య రూపాదేవి మృతి విషయాన్ని తెలుసుకొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కొంపెల్లి లోని రెనోవా ఆస్పత్రి చేరుకొని ఎమ్మెల్యే సత్యం ను పరామర్శించారు. అయితే ఆత్మహత్యకు ముందు రూపాదేవి, ఎమ్మెల్యే సత్యం కు సాయంత్రం వీడియో కాల్ చేసి చనిపోతున్నట్లుగా తెలిపినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఇంటికి చేరుకునే లోపే ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి ఎమ్మెల్యే కన్నీటిపర్యంతమయ్యారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.