యాదాద్రి జిల్లాలోని ఆలేరు పట్టణంలో స్థానిక ఆర్యవైశ్య భవన్ వద్ద ఆర్యవైశ్య సంఘం పట్టణ శాఖ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు అలైబాలై కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులను ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పసుపునూరి వీరేశం, మండల అధ్యక్షులు సముద్రాల కుమార్ , పట్టణ అధ్యక్షులు అయిత వెంకటేష్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వంగపల్లి ఆంజనేయస్వామి, నాయకులు సముద్రాల శ్రీధర్, ప్రకాష్, నాగబండి జగదీష్, శ్రీను, ఎర్రం భాస్కర్, బాలేష్ తదితరులు పాల్గొన్నారు
తదనంతరం ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సంఘ నాయకులు మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ కోల్కత్తాలో గాంధీజీని అవమానించిన విధానం చాలా బాధాకరమని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని లేనియెడల పట్టణ గ్రామ మండల జిల్లా స్థాయిలలో తీవ్ర నిరసన కార్యక్రమాలు తెలుపుతామని డిమాండ్ చేశారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Next Post