ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతరకు సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి…
ఈ నెల 13నుండి జరగనున్న ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర ఆహ్వాన పత్రికను ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అందజేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే *అరూరి రమేష్* మరియు డీసీసీబీ చైర్మన్ *మార్నేని రవీందర్ రావు* ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ ని ఐనవోలు జాతరకు హాజరు కావాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు సీఎం కేసీఆర్ కు వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.అనంతరం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్కి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ నాగేశ్వర రావు,ఆలయ మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య,ప్రధాన అర్చకులు రవీందర్, విక్రంత్ జోషి, మధుకర్ శర్మ,పురుషోత్తమశర్మ తదితరులు పాల్గోన్నారు…