ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 3: పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఓట్ల లెక్కింపును కీసరలోని హోలిమేరీ కళాశాలలో మంగళవారం నిర్వహించనున్నారు. నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు 28 టేబుళ్లను ఏర్పాటు చేసి 22 రౌండ్లు నిర్వహించనున్నారు. దీనికి గాను 32 మంది కౌంటింగ్ అధికారులు, 32 మంది సహాయ సిబ్బంది, 38 మంది మైక్రో అబ్జర్వర్లతో మొత్తం 102 మందిని నియమించారు.
ఈ మేరకు కౌంటింగ్ లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఓట్ల లెక్కింపు పారదర్శకంగా సాగాలని కుత్బుల్లాపూర్ ఏఆర్వో పులి సైదులు కౌంటింగ్ సిబ్బందికి సూచించారు.