గ్రీన్ హిల్స్ కాలనీ లో వైభవంగా వాయు ప్రతిష్ట
నిజాంపేట (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 6: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో కాలనీవాసులు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వాయు ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు. ఆలయం లో ఏర్పాటుచేసిన గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివలింగం, పంచముఖ ఆంజనేయ స్వామి, దుర్గామాత, నవగ్రహాలకు వారు వాయు ప్రతిష్ట చేశారు.
వాయు ప్రతిష్టను వేద పండితుల సమక్షంలో గణపతి హోమంతో ప్రారంభించి 51 కలశాలతో అభిషేకము, ప్రత్యేక పూజలు కాలనీవాసులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గోల్డ్ మ్యాన్, మెట్టుగూడ యూత్ ఐకాన్ రాజేందర్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసులు, రవీందర్, బీర యాదవ్, సురేష్, కిషోర్, సాయి, ఆనంద్, శ్రీనివాస్, టి. డి. రావు, గోవర్ధన్ రెడ్డి, సాంబశివరావు, ఎన్. శ్రీనివాస్, ఆంజనేయులు, లవకుశ, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.