ఫ్రీడం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జ్ కటకం శ్రీనివాస్ గుప్తా ఈరోజు రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాను హైదరాబాదులోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఫ్రీడమ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా ఇన్చార్జిగా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కటకం శ్రీనివాస్ గుప్తా నియామకమవడం శుభ పరిణామం అని ఆర్యవైశ్యులు కూడా అన్ని రంగాలలో ముందుంటారు అనేదానికి కటకం శ్రీనివాస్ నిదర్శనమని ప్రతి మనిషికి ఉన్నటువంటి కనీస మానవ హక్కును తెలియజేసి వారి బాధ్యతను గుర్తు చేసే విధంగా కటకం శ్రీనివాస్ గుప్తా తెలియజేయాలని బాధిత వ్యక్తులకు సహకరిస్తూ వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు
కటకం శ్రీనివాస్ మాట్లాడుతూ సేవాగుణంలో ఆర్యవైశ్యులు ఎంతో ముందు ఉంటారని దానితోపాటు వ్యాపార రాజకీయ రంగంలో కూడా ఆర్యవైశ్యులకు సాటి లేరని ఉప్పల శ్రీనివాస గుప్తా ఒక ఉదాహరణ అని సేవా వ్యాపార రాజకీయ రంగంలో రాణించడానికి మిగతా ఆర్యవైశ్య నాయకులు కూడా ముందుకు రావడానికి ఎంతో సహకరిస్తున్నారని కెసిఆర్ కేటీఆర్ ఆశయాలను నెరవేరుస్తూ ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తూ పలువురికి ఆదర్శనీయుడుగా నిలిచారని తెలిపారు కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.