బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా కేశవ్ యాదవ్ నియామకం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 26 : బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శిగా న్యాయవాది కేశవ్ యాదవ్ శుక్రవారం నియమితులయ్యారు. బిజెపి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి ఈ మేరకు నియామక పత్రాన్ని షాపూర్ నగర్ లోని బిజెపి కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ బిజెపిలో అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్త కి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం తప్పక ఉంటుందని కేశవ యాదవ్ అన్నారు. తనలాంటి సాధారణ కార్యకర్తని జిల్లా కార్యదర్శిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు.
తాను చిన్నతనం నుంచి జాతీయ భావజాలాలు కలిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ (ఆర్ఎస్ఎస్) నుంచి క్రమశిక్షణను, ఏబీవీపీ నుంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారని తెలిపారు. బిజెపిలో గ్రామస్థాయి సాధారణ కార్యకర్త నుంచి గ్రామ అధ్యక్షునిగా, బిజెపి యువమోర్చా డివిజన్ అధ్యక్షునిగా, అసెంబ్లీ కన్వీనర్ గా, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించి ఈ స్థాయికి చేరుకున్నారని, పార్టీ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించానన్నారు. తనకు ఈ బాధ్యత రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవితో పార్టీలో తన బాధ్యత మరింత పెరిగిందని, జిల్లా స్థాయిలో పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బక్క శంకర్ రెడ్డి, చెంది శ్రీనివాస్, పత్తి రఘుపతి, డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, పత్తి సతీష్, సాయినాథ్ నేత, పరుష వేణు, దుర్యోధన రావు పాల్గొన్నారు.