బౌరంపేట పీఏసీఎస్ నికర లాభం రూ. 49.88 లక్షలు
• సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన ప్యాక్స్ అధ్యక్షుడు మిద్దెల బాల్ రెడ్డి
• ఆమోదించిన సంఘ సభ్యులు
దుండిగల్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 30 : రైతు రుణమాఫీ కోసం బ్యాంకు వారితో, వ్యవసాయ శాఖ అధికారులతో సంప్రదిస్తున్నామని సాధ్యమైనంత త్వరగా రుణమాఫీ జరిగేలా చర్యలు చేపడతామని బౌరంపేటలోని
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మిద్దెల బాల్ రెడ్డి అన్నారు. సహకార సంఘం సర్వ సభ్య సమావేశాన్ని మిద్దెల బాల్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023-24 సంవత్సరానికి గాను పరిపాలన నివేదికను,ఆదాయ వ్యయాలు,లాభ నష్టాలు, ఆస్తులు, అప్పులను సభ్యులు ఆమోదించారు. సంఘం నికర లాభము రూ. 49.88 లక్షలు అర్జించుందని ఆయన తెలిపారు. అనంతరం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వారికున్న సందేహాలను ఆయన నివృత్తి చేశారు.
సంఘ కార్యదర్శి సయ్యద్ అసదుల్ల సంఘ పరిపాలన నివేదికను, సంఘ కార్యకలాపాల వివరాలను సభ్యులకు చదివి వినిపించారు. ఈ సర్వసభ సమావేశంలోసంఘ ఉపాధ్యక్షులు ఎ. వెంకటేశ్, డైరెక్టర్లు ఎస్. భీంరెడ్డి, డప్పు కిష్టయ్య, మహిపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, డి ఇంద్రసేనా రెడ్డి, ఈదులకంటి యాదయ్య, ఆరకలి జీతయ్య, మోహన్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.