వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని పిఎస్ లో చిన్నారుల ఫిర్యాదు
– కొంపల్లి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
– రేవంత అంకుల్… వివేక్ అంకుల్ మా ప్రాణాలు కాపాడాలంటూ ప్లకార్డులతో నిరసన
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), జూలై 21: అంకుల్… అంకుల్… మమ్మల్ని వీధి కుక్కలు కరుస్తున్నాయి, మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని, కొంపల్లి మున్సిపల్ కమిషనర్ అంకుల్ పట్టించుకోవడంలేదని ఎం ఎం సి ఎల్ నార్త్ కాలనీకి చెందిన చిన్నారులు వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు రేవంత్ అంకుల్, వివేక్ అంకుల్ మాకు రక్షణ కల్పించరా..? వీధి కుక్కల బారిన పడి మా ప్రాణాలు పోవాల్సిందేనా అని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను ఉద్దేశించి ప్లకార్డులు పట్టుకొనిపట్టుకుని పిఎస్ ముందు నిరసన గళాన్ని వినిపించారు. తమ కాలనీలో గత రెండున్నర సంవత్సరాల నుంచి సుమారు 75 మందిని వీధి కుక్కలు కరిచాయని, ఇదే విషయంపై అప్పటినుంచి సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ కమిషనర్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కొంపల్లి కమిషనర్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతోనే పోలీస్ స్టేషన్లో అసలించాల్సి వచ్చిందని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు.