సందడిగా రాయల్ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే

కుత్బుల్లాపూర్, న్యూస్ విధాత్రి, ఫిబ్రవరి 27: చింతల్ రాయల్ డిగ్రీ కళాశాల ప్రెషర్స్ డే కార్యక్రమాన్ని వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన క్యాట్ వాక్, ఫ్యాషన్ షోతో పాటు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.శనివారం విడుదలైన డిగ్రీ సెమిస్టర్ లో 9.76/10 జిపిఏ సాధించిన విద్యార్థి షబా తరణం, 9.6 సాధించిన ప్రియాంక, అప్ష షా విద్యార్థులను యాజమాన్యం సన్మానించారు. ఆ విద్యార్థులకు ఎటువంటి ట్యూషన్ ఫీజు లేకుండా ఉచిత విద్యను అందిస్తామని కళాశాల యాజమాన్యం ఈ సందర్భంగా ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మేనకా పాటిల్, డైరెక్టర్లు, సి .హెచ్ గోవిందరెడ్డి, ఎన్ .వెంకట్ రెడ్డి, జి.రమేష్ బాబు, కె .రామకృష్ణ, నల్ల జై శంకర్ గౌడ్ , అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More