సీఎస్ సోమేశ్‌కుమార్ రిలీవ్..డీవోపీటీ ఉత్తర్వులు*
*సీఎస్ సోమేశ్‌కుమార్ రిలీవ్..డీవోపీటీ ఉత్తర్వులు*
దిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 12వ తేదీలోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్‌కుమార్‌ను ఆదేశించింది.