సుభాష్ నగర్ రొయ్యల మేత గోదాములలో భారీ ప్రమాదం
ఫ్లాష్… ఫ్లాష్ …ఫ్లాష్…
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 9: జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పైప్ లైన్ రోడ్డులో ఉన్న ఓ రొయ్యల మేత తయారు చేసే గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంబంధించినట్లు తెలుస్తుంది. దీంతో పక్కనే ఉన్న మరో రెండు గోదాములకు కూడా మంటలు వ్యాపించి ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లు సమాచారం. గోదాములు తెరవక ముందే అగ్నిప్రమాదం సంభవించిందని, నిర్వాహకులు ఇప్పుడిప్పుడే వాటిని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.