కుత్బుల్లాపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 29:  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన సద్దుల బతుకమ్మ వేడుకలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వాడవాడలా మహిళలు సోమవారం ఘనంగా నిర్వహించారు.

శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్లో బతుకమ్మలతో మహిళలు

ప్రతి సంవత్సరం దసరా సందర్భంలో జరుపుకునే ఈ పండుగలో నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

బతుకమ్మ ఆడిన గణేష్ నగర్ మహిళలు

పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను సమూహంగా ఒకేచోట ఉంచి, పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ నృత్యాలతో ఆనందోత్సాహాలతో అలరించారు.

కృష్ణకుంజ్ అపార్ట్మెంట్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

అనంతరం బతుకమ్మలను సమీపంలోని చెరువులు, కుంటలతో పాటు కృత్రిమ కొలనులలో నిమజ్జనం చేశారు.

కుత్బుల్లాపూర్ గ్రామంలో బతుకమ్మలతో మహిళలు

కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మా నగర్ రింగ్ రోడ్డు, గణేష్ నగర్, చింతల్, షాపూర్ నగర్, జీడిమెట్ల, సూరారం, కొంపల్లి, దుండిగల్, బాచుపల్లి, నిజాంపేట ప్రాంతాలతో పాటు పలు కాలనీలు, బస్తీలలో బతుకమ్మ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

 

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More