కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ సందీప్ కుమార్ ఝా బదిలీ
• నూతన జోనల్ కమిషనర్ గా పర్మర్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 26: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( సిఎంసి) కుత్బుల్లాపూర్ జోన్ జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన సందీప్ కుమార్ జా బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనను జనగామ జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఆయన స్థానంలో కుత్బుల్లాపూర్ జోన్ నూతన జోనల్ కమిషనర్ గా జనగామ జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన పర్మర్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.