గణేష్ నగర్ డివిజన్ లో ఘనంగా బాబూ జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 5:  బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని గణేష్ నగర్ డివిజన్ (284) పరిధి అంబేద్కర్ నగర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన సమాజ సేవ, దళితుల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ కార్పొరేటర్ గౌరీష్, దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గుడ్డేటి రాజు, నియోజకవర్గ మైనారిటీ కన్వీనర్ ఖయూం పాషా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్. సిద్ధయ్య, ఇరుగు రాధాకృష్ణ, శ్రీనివాస్, డి. రాజు, రవి కుమార్, అరుణలత, నగేష్, ప్రసాద్, అంబేద్కర్ నగర్ అధ్యక్షులు దిలీప్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన సమాజ సేవ, దళితుల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More