ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
నిజాంపేట (న్యూస్ విధాత్రి), జనవరి 23:
ఆజాద్ హిందూ ఫౌజ్‌ను స్థాపించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహానీయుడు, స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో బాచుపల్లిలోని హరితవనం కాలనీలో ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారతదేశ సౌర్యాన్ని, సైనికుల పరాక్రమాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప నాయకుడు నేతాజీ అని విజయలక్ష్మి సుబ్బారావు కొనియాడారు. భారత సైన్యానికి మార్గదర్శకులుగా నిలిచిన నేతాజీ జీవితం భావి భారత పౌరులకు ఆదర్శప్రాయమని తెలిపారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి, దేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవాలనీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ముంజేటి రామారావు, కొండమ నాయుడు, కొమ్మారెడ్డి శ్రీనివాస్, వెంకటేశం, సుబ్బారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొని నేతాజీకి ఘన నివాళులు అర్పించారు.