చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 19:  చెట్ల కొమ్మల తొలగింపు పనులు నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం (20వ తేదీన) కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఏఈ రవీందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు హెచ్‌ఎంటీ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ గణేష్‌నగర్ ఫీడర్ పరిధిలోని చెరుకుపల్లి, కల్పనా సొసైటీ, పద్మానగర్ ఫేజ్-1, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. అలాగే మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు 11 కేవీ ద్వారకానగర్ ఫీడర్ పరిధిలోని ద్వారకానగర్, డీ నగర్, ప్రసూన నగర్, మాణిక్య నగర్, అంబేద్కర్ నగర్, న్యూ వివేకానంద నగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More