దూలపల్లి ప్రధాన రహదారిలో అక్రమ షెడ్ల తొలగింపునకు అడ్డంకులు!

• కూల్చివేతకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్న నిర్మాణదారులు.. ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగిస్తున్నారనే ఆరోపణలు
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 28:  కొంపల్లి సర్కిల్ పరిధిలోని దూలపల్లి ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షెడ్ల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది.

పోలీసులతో వాగ్వాదానికి దిగిన నిర్మాణదారులు

అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వచ్చిన అధికారుల విధులకు సంబంధిత షెడ్ల నిర్మాణదారులు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా, నిర్మాణదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

గోడలను పాక్షికంగా కూల్చిన సిబ్బంది

• అధికారుల చర్యలకు ఆటంకాలు?
దూలపల్లి ప్రధాన రహదారి పరిధిలో నిర్మించిన షెడ్లకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో షెడ్లను తొలగించేందుకు అధికారులు అక్కడికి చేరుకోగా, నిర్మాణదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తొలగింపు ప్రక్రియకు అడ్డుపడుతున్నారు.

ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిర్మాణదారులను అదుపులోకి తీసుకోవడంతో అక్రమ షెడ్ల కూల్చివేతలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో అక్రమ షెడ్ల కూల్చివేతలు పాక్షికంగా మాత్రమే చేసి తూతూ మంత్రంగా చర్యలు చేపట్టడంపై కొంపల్లి పట్టణ ప్రణాళిక అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా పైరవీలకు తలోగ్గి కూల్చివేతలను నిలిపివేసినట్లు పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మరి సదరు షెడ్లపై తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More