బాధ్యతలు చేపట్టిన నూతన ఉప కమిషనర్లు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 24: జిహెచ్ఎంసి పరిధిలో ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా జీడిమెట్ల, గాజులరామారం సర్కిళ్ల ఉప కమిషనర్లు బదిలీ అయిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో జీడిమెట్ల సర్కిల్ నూతన ఉప కమిషనర్ గా డి. శంకర్ సింగ్, గాజులరామారం సర్కిల్ నూతన ఉప కమిషనర్ గా శ్రీపాద రామేశ్వర్ నియమితులయ్యారు. ఈ మేరకు వారు ఆయా సర్కిళ్లలో శనివారం బాధ్యతలు చేపట్టారు. అయితే శంకర్ సింగ్ యూసఫ్ గూడా సర్కిల్ నుంచి, శ్రీపాద రామేశ్వర్ నిజామాబాద్ నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు.