వెంకన్న హిల్స్ కాలనీలో సమస్యలపై పర్యటించిన అధికారులు
– సమస్యల పరిష్కారానికి హామీ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 19: జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని వెంకన్నహీల్స్ కాలనీని జీడిమెట్ల ఉప కమిషనర్ శంకర్ సింగ్, ఏ యం హెచ్ వో డాక్టర్ కవిత, డిఈ బాలమురళి, ఏఈ ఆభిరామ్, వర్క్ ఇన్స్పెక్టర్ భాస్కర్, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సంబంధిత విభాగాల అధికారులు శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా వెంకన్న హిల్స్ సంక్షేమ సంఘ సభ్యులు కాలనీలో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, వర్షపు నీటి పారుదల సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, మంచినీటి సరఫరా సమస్యలు, అలాగే కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ ఫ్లోర్లో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వంటి సమస్యలను వివరించారు.
కాలనీ వాసుల సమస్యలను శ్రద్ధగా విన్న డిసి శంకర్ సింగ్ సంబంధిత అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ శాఖల అధికారులు కూడా తమ పరిధిలోని సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకన్న హిల్స్ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ పెద్దలు, స్థానిక నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.