అమ్మ ఇంకా చనిపోలేదు… త్వరగా వచ్చి చంపేయండి

కన్నతల్లిని కడతేర్చిన కసాయి కూతురు

• ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టిన బాలిక
• మెడకు చున్నీ బిగించి ఘాతుకం
• ప్రియుడు అతని సోదరుడితో కలిసి హత్య
• ఇన్స్టాలో పరిచయం… ఇంటిలోనే సహజీవనం…
• ముందు పెళ్లికి అంగీకరించి ఆపై నిరాకరించడంతోనే….
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 25: హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి కన్నతల్లిని కడతేర్చిన బాలిక ఉదంతం తెలిసిందే. ఈ మేరకు బాలానగర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి డీసీపీ సురేష్ కుమార్ హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు.

కేసు వివరాలు వెల్లడిస్తున్న బాలానగర్ డిసిపి సురేష్ కుమార్

డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం… జీడిమెట్ల సీఎస్ పరిధిలోని షాపూర్ నగర్ ఎన్ఎల్బీ నగర్ కు చెందిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంలోని కళాకారిణి ఆంజలి (30) తన ఇద్దరు కుమార్తెలతో (ఇద్దరూ మైనరు బాలికలే) నివాసముంటుంది. ఈ క్రమంలో 10వ తరగతి చదువుతున్న అంజలి పెద్ద కుమార్తెకు ఇటీవల కట్టంగూర్ కు చెంది డీకే బృందంలో పని చేస్తూ స్థానికంగా నివాసముంటున్న పగిళ్ల శివ (19)తో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో విషయం తెలిసిన బాలిక తల్లి ఆంజలి నిరాకరించి బాలికను మందలించింది. దీంతో ఈ నెల 18వ తేదీన తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అంజలి 18వ తేదీన జీడిమెట్ల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆచూకీ కోసం గాలించిన పోలీసులు 20వ తేదీన వారిని పట్టుకొని పోలీసు స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చి శివకు నోటీసులిచ్చి ఎవరింటికి వారిని వంపించారు. ఈ క్రమంలో తన తల్లి ఆమె ప్రేమకు అడ్డుగా ఉందని భావించి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో పథకం రచించుకుంది.
సదరు విషయాన్ని ముందుగా ఆమె ప్రియుడు శివకు రెవ్వగా అతను నిరాకరించాడు. దీంతో తన మాట వినకపోతే అతని పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని శివను బెదిరించింది. దీంతో శివ ఒప్పుకోవడంతో పథకం ప్రకారం అంజలిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శివ అతని సోదరుడు (మైనర్) తో కలిసి బైక్ పై  బాలిక ఇంటికి సోమవారం రాత్రి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న బాలిక చెల్లెల్ని బయటకు పంపి బాలిక శివకు ఫోన్ చేసి ఇంట్లోకి పిలిచి తెల్ల చున్నీని ఇచ్చింది. ఇంట్లో కూర్చీలో కూర్చొన్న అంజలిని శివ కింద పడేయడంతో ఆమె ముందుకు పడిపోవడంతో వెంటనే చున్నీని ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేశారు. దీనికి బాలిక, శివ తమ్ముడు సహకరించారు. అనంతరం ఆమె స్పృహ కోల్పోవడం అంజలి చనిపోయిందని నిర్ధారించుకొని శివ అతని సోదరుడు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బయటకు పంపిన బాలిక చెల్లెలు ఇంటికి వచ్చింది. దీంతో అమ్మ ఇప్పుడే ఇంట్లోకి రావొద్దన్నదని తన చెల్లెలిని బాలిక (నిందితురాలు) బయటనే కూర్చోబెట్టింది. చాలాసేపటి తర్వాత ఆ బాలిక ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి వంటగదిలో అంజలి స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నట్లు ఆమె చిన్న కుమార్తె గుర్తించింది. దీంతో ఆ బాలిక ఏడుస్తూ అంజలిని లేపే ప్రయత్నం చేసింది. ఎంతకీ లేవకపోవడంతో 108కి గానీ, ఎవరినైనా పిలవాలని నిందిరాలిని కోరినా ఎవరినీ పిలవకుండా కాలయాపన చేసి చివరికి మరల శివకే ఫోన్ చేసింది. అమ్మ ఇంకా చనిపోలేదు త్వరగా వచ్చి చంపేయండని చెప్పింది. దీంతో తిరిగి వచ్చిన వారితో కలిసి నిందితురాలు అంజలిని కాపాడుతున్నట్లు నటించి ఆమె ముఖంపై నీళ్లు చల్లుతూ ఇంట్లో ఉన్న తన చెల్లెలిని తెలిసిన వారిని తీసుకురమ్మని బయటకు పంపారు. ఆంజలి చిన్న కూతురు బయటకు వెళ్లగానే మరల చున్నీని మెడకు బిగించి చంపారు. ఈ సారి హర్తా ఊపిరి పోయిందని నిర్ధారించుకొని నిందితులిద్దరూ అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు. సోమవారం రాత్రి 11.30 గంటల వరకు తల్లి హత్య విషయాన్ని నిందితురాలు ఎవరికీ తెలియకుండా గుట్టుగా ఉంచింది. అంజలి చిన్న కూతురు విషయాన్ని అందరికీ తెలపడంతో రాత్రి 11.40 గంటలకు డయల్ 100 ద్వారా జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంగా వారు సంఘటన స్థలికి చేరుకున్నారని డీసీపీ వివరించారు. మృతురాలి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆర్థరాత్రి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నల్గొండకు వెళ్లారు. తెల్లవారే సరికి హత్య చేసిన శివతో పాటు అతని సోదరున్ని అదుపులోకి తీసుకొని బుధవారం రిమాండ్  కు తరలిస్తామని డీసీపీ తెలిపారు.
ప్రేమ నిరాకరించినందుకేనా…? లేక వేధింపులు తాళలేకా…?
మృతురాలు ఆంజలికి పెద్ద కుమార్తె (నిందుతురాలు) పుట్టిన అనంతరం భర్త మరణించారు. దీంతో కొన్నాళ్లకు ఆమె రెండో వెళ్లి చేసుకుంది. వీరికి మరో కుమార్తె (చిన్న కూతురు) జన్మించాక రోడ్డు ప్రమాదంలో రెండో భర్త కూడా చనిపోయాడు. ఆప్పటి నుంచి ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్న ఆమె పెద్ద కూతురిని ప్రేమగా చూసేది కాదని ఎప్పుడూ అసభ్యకర మాటలతో పాటు.. ఎక్కువగా కొడుతూ వేధించేదని, శరీరం పై కాల్చి వాతలు పెడుతుండేదని స్నేహితులు, స్థానికుల సమాచారం. బాలిక 7వ తరగతిలో ఉన్నప్పుడే తల్లితో ఉండనని పోలీసులకు ఫిర్యాదు చేసి, కేర్
హోంలో ఉన్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన ప్రకారం దీనికి బలం చేకూరుతుంది. దీంతోనే వాటిని మనస్సులో పెట్టుకొని ఈ ఆఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటుందా…? లేక నిజంగానే ప్రేమకు అడ్డు వస్తుందని చేసిందా..? అనేది స్థానికులు చర్చించుకుంటున్నారు.
• ముందు ఒప్పుకొని….. పై నిరాకరణ….
కూతురు ప్రేమ విషయం తెలిసిన ఆనంతరం మృతురాలు అంజలి ముందుగా వెళ్లికి ఒప్పుకోవడంతో వారిద్దరూ సహ జీవనం సాగిస్తూ ఇంట్లోనే ఉండేవారని, ఈ క్రమంలో శివని డబ్బుల కోసం మృతురాలు బ్లాక్ మెయిల్ చేయాలని చూసిందనే వాదన కూడా వినిపిస్తుంది. దీంతోనే వారి ప్రేమను కూడా నిరాకరించిందని తెలుస్తుంది.
• అంజలి మాకు నచ్చదు చంపడం కరెక్టే… నిందితుడి తల్లి
బాలిక తల్లి అంజలిని తన కుమారుడు శివ చంపడం కరెక్టేనని ఆతడి తల్లి సంతోష్ కుమారుడిని వెనకేసుకొస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇద్దరు కొడుకులు కేసులో నిందితులుగా ఉన్నా ఈ రోజు కాకపోతే రేపు వెళ్లి వారిని బయటకు తీసుకొస్తాం…ఏమైతుంది. ఉండనీయండి అంటూ ఎటువంటి జంకు లేకుండా తెలిపింది. బాలిక (నిందితురాలు) ఇటీవల తమ ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండి వెళ్లిందని, తాము బంధువులమే అవ్వడంతో తాము ఏమి అనలేదని తెలిపింది. సదరు విషయం అంజలికి నచ్చలేదని, దాంతో తమపై పీఎస్ లో కేసులు పెట్టిందని, అందుకే. అంజలి అంటే తమకు నచ్చదనే వ్యాఖ్యలు చేసింది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More