ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటా. – ఈటెల రాజేందర్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 2: దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి బాపు నగర్ లో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బాపునగర్ లోని శివాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. శివాలయ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గిరివర్ధన్ రెడ్డి, భరత సింహారెడ్డి, కట్ట కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, బాపునగర్ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.