యువకుడిని కత్తులతో నరికి దారుణ హత్య
• జగదిరిగుట్ట పిఎస్ పరిధిలోని ఎల్లమ్మబండలో సంఘటన
• గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి దారుణం
జగద్గిరిగుట్ట (న్యూస్ విధాత్రి), ఆగస్టు 5 :
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో దారుణ హత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువకుడు స్థానికంగా ఉన్న గుడ్ విల్ హోటల్లో టీ తాగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ఆ యువకుడిపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. దాంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు గల కారణాలు, హత్య చేసిన వారు, హత్యకు గురైన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. జగద్గిరిగుట్ట పోలీసులకు అందిన సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.