కుత్బుల్లాపూర్‌లో దారుణం

• ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్‌ 14: మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. పద్మనగర్‌ ఫేజ్‌–1లో నివాసముంటున్న సాయి లక్ష్మి (27) తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో తన ఇద్దరు రెండేళ్ల కవల పిల్లలు బాబు, పాపలను గొంతు నులిమి హతమార్చి, అనంతరం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

విగత జీవుల పడి ఉన్న రెండేళ్ల కవలలు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో భార్యాభర్తల మధ్య కలహాలే ఈ విషాదానికి కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More