గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా విజయవంతం చేయాలి. – జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 13: రానున్న వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని జీడిమెట్ల పోలీసుల ఆధ్వర్యంలో సిఐ గడ్డం మల్లేష్ సమక్షంలో గణేష్ ఉత్సవ సన్నాక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ పరిధిలోని వివిధ మండపాల నిర్వాహకులు, కాలనీ, బస్తీలో సంక్షేమ సంఘం సభ్యులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రానున్న వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవాలని సిఐ నిర్వాహకులకు సూచించారు. పోలీసులు, సంబంధిత అధికారుల సూచనల మేరకు అన్ని అనుమతులను తప్పనిసరిగా తీసుకొని వాటికి అనుగుణంగా నడుచుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. గత సంవత్సరం ఉత్సవాలలో చోటు చేసుకున్న లోటుపాట్లను, అవకతవకలను అధికమిస్తూ ముందుకు సాగాలన్నారు. ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను, మెలకువలను, సలహాలను సిఐ వారికి సూచించారు. ముఖ్యంగా వినాయక నిమజ్జనాల సమయంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా భక్తిశ్రద్ధలతో ఊరేగింపును నిర్వహించి పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటూ సహకరించాలని తెలిపారు. అలాగే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా జరుపుకునేందుకు అవసరమైన పలు సూచనలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జీడిమెట్ల డిఐ ఎస్ కనకయ్య, ఎస్సైలు ప్రేమ్ సాగర్, సురేష్, సత్యనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.