ఘనంగా పొత్తూరి దుర్గారావు పదవి విరమణ వీడ్కోలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 30: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ సమయంలో తాము చేసిన సేవలే జ్ఞాపకాలుగా పదిలంగా ఉంటాయని గాజుల రామారం సర్కిల్ ఉప కమిషనర్ మల్లా రెడ్డి పేర్కొన్నారు. దీర్ఘ కాలంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించి శనివారం పదవి విరమణ పొందిన పొత్తూరి దుర్గారావు ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. సవాలుతో కూడుకున్న పారిశుధ్య విభాగం లో నిబద్ధతతో పనిచేసిన దుర్గారావును ఈ సందర్భంగా డిసి అభినందించారు. గాజులరామారం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏ ఎం వో హెచ్ మమత, పారిశుద్ధ్య విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.