చెత్తను స్వచ్ఛ ఆటోల వారికి మాత్రమే అందించాలి.- డిసి శంకర్ సింగ్
• బహిరంగ ప్రదేశాల్లో పడవేయవద్దు
• పరిశుభ్రతే ప్రజా ఆరోగ్యానికి బాట
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 1:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా జీడిమెట్ల సర్కిల్ పరిధిలో 27వ రోజు బుధవారం కార్యక్రమాలను అధికారులు విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ డివిజన్(286) అయోధ్యా నగర్ లో ఓపెన్ నాలాలో పూడికతీత పనులు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువల శుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ పనులను చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జీడిమెట్ల సర్కిల్-55 ఉప కమిషనర్ శంకర్ సింగ్ ప్రత్యక్షంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు.

అనంతరం జీడిమెట్ల సర్కిల్ పరిధిలో స్వచ్ఛ ఆటోల నిర్వాహకులతో సర్కిల్ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్లపై చెత్త వేయకుండా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆటోలలోనే చెత్తను వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఆటోల్లో సేకరించిన చెత్తను తరలించే సమయంలో అది బయటకు పడిపోకుండా తగిన చర్యలు తీసుకొని, నిర్దేశిత డంపింగ్ పాయింట్‌కి తీసుకెళ్లాలని డ్రైవర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎస్ డబ్ల్యు ఎం ఏఈ సాయి లిఖిత, పారిశుద్ధ్య జవాన్ జిలానీ పాషా, సిబ్బంది పాల్గొన్నారు.