చెరుకుపల్లి కాలనీ ప్రజలకు తక్షణమే మంచినీటి సరఫరా కల్పించాలి. – సంక్షేమ సంఘం సభ్యులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి ), జూన్ 6: చెరుకుపల్లి కాలనీలో గత రెండు నెలలుగా నెలకొన్న మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు జలమండలి అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా కాలనీలో తగినంత నీరు అందక ప్రజలు రోజువారీ అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో నెలకొన్న పరిస్థితులను వెంటనే పరిశీలించి, తగిన చర్యలు తీసుకుని నిరంతరాయంగా మంచినీటి సరఫరా అందేలా చూడాలని అధికారులను వారు కోరారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి కాలనీ ఫేజ్ – 2 సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.