జాతరలు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు నిర్వహించే పవిత్ర ఉత్సవాలు. – ఎమ్మెల్యే వివేకానంద్

• కుత్బుల్లాపూర్‌లో ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి జాతర
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 3:  జాతరలు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు నిర్వహించే పవిత్ర ఉత్సవాలేనని, అలాగే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందించే గొప్ప పండుగలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్‌లో కొలువుదీరిన శ్రీ వేణుగోపాల స్వామి జాతర మహోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా మంగళవారం పాల్గొన్నారు. జాతరలు, ఉత్సవాలు వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని మరింత పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని, గ్రామాభివృద్ధితో పాటు సంప్రదాయాలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

కుత్బుల్లాపూర్ గ్రామస్థులతో ఎమ్మెల్యే వివేకానంద్

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఇంద్రసింగ్ ఠాకూర్, శ్రీరాములు గౌడ్, నల్ల లింగం గౌడ్, బలవంత రెడ్డి పటేల్, సామల నరసింహ రెడ్డి, పెద్ది మల్లేష్, మురళి గౌడ్, నార్లకంటి నాగేష్, బిక్షపతి గౌడ్, నరహరి, కె.ఎం. ప్రకాష్ గౌడ్, నార్లకంటి శ్యామ్, ఆటో బలరాం, నార్లకంటి విష్ణు కుమార్, దండు వేణు, నార్లకంటి కుమార్, కుంట వేణు, డివిజన్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, పోలే శ్రీకాంత్, పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More