కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 7: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపే ధ్యేయంగా కృషి చేయాలని కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక సందర్భంగా బోరబండ డివిజన్ పరిధి బంజారా నగర్ లోని 7 బూతులలో ప్రచారానికి గాను కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ నియమించిన బాధ్యులు, కార్యకర్తలతో గౌరీష్ మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు వారికి కేటాయించిన బూత్ లలో ప్రతి ఓటర్ వద్దకు వెళ్లి విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు.

నియోజకవర్గంలో బిఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. బూత్ స్థాయి బాధ్యులతో పాటు కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజారిటీతో గెలుపొందేలా పాటుపడాలని గౌరీష్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బంజారా నగర్ లోని 7 బూతుల బాధ్యులు సత్తిరెడ్డి, దేవరకొండ శ్రీనివాస్, సూర్యప్రభ, కిషోర్ చారి, ఆంజనేయులు, రమేష్, వడ్ల స్వామి, మధుకర్ రెడ్డి, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల అధ్యక్షులు, మహిళ నాయకులు పాల్గొన్నారు.